top of page

పురాణ పుటల్లో

yassu1111

Updated: Apr 15, 2020

పురాణాల పేజీలు తిరగేస్తే,అందులో మనం అరుదుగా మాట్లాడుకొనే ఎన్నో విలువైన అంశాలు ఉన్నాయి.వాటిల్లో కొన్నిటిని మళ్లీ ప్రేక్షకుల ముందుకి తీసుకురావటం కోసం చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఇది.


1.రామాయణం ప్రకారం శ్రీరామునికి ఒక సోదరి ఉంది. తను రాముని కంటే పెద్దది.తన పేరు శాంత .కానీ శాంతను దశరథుడు తన అత్తకు దత్తత గా ఇస్తాడు. ఆ తరువాతనే రఘువంశ వారసుని కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అప్పుడే రామలక్ష్మణభరతశతృఘ్నులు జన్మిస్తారు.


2.రావణుని కి ముగ్గురు భార్యల ద్వారా మొత్తం ఏడుగురు కొడుకులు ఉన్నారు. మనకు బాగా సుపరిచితుడైన ఇంద్రజిత్తుడు లేదా మేఘనాథుడు మండోదరి కొడుకు. మండోదరి కి , అక్షయ కుమారుడు అనే ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. ధన్యమాలిని ద్వారా అతికాయుడు , నరాంతక , దేవాంతక, త్రిశిర, ప్రహస్థ అనే ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు.


3.


.సాధారణం గా బ్రహ్మ పంచముఖుడు.బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని వివాదం జరుగుతుండగా లింగాన్ని తాకినట్టుగా అబద్ధం చెప్తాడు బ్రహ్మ.కోపగ్రహీతుడైన శివుడు బ్రహ్మ యొక్క తల ఒకటి నారికేవేయగా బ్రహ్మహత్యాపాతకం చ్ట్టుకొని,కాశీకి పోయి,ఆ బ్రహ్మ యొక్క కపాలం చేత పట్టి బిచ్చామెట్టుకుంటాడు.ఆ శివుని ఆకలి తీర్చటానికి ఆ పార్వతి దేవి అన్నపూర్ణ గా అవతరిస్తుంది.


4.రాక్షస గణానికి చెందడం వల్ల ఘటోత్కచుడు పగటిపూట యుద్ధం చేయలేదు.ఈ బల శాలిని ఎలా అయినా మట్టికరిపించటంకోసం,అర్జునుని కోసం దాచిన బ్రహ్మాస్త్రాన్ని కర్ణుడు రాత్రిపూట ఉపయోగిస్తాడు.ఎలా ఎన్ని అస్త్రాలు,విద్యలున్న సమయానికి లేదా అనుకున్న పనికి ఉపయోగ పడకపోవడం కర్ణుడి చావుకు వెయ్యి గం డాలు అనే జాతీయం కి మరో ఉదాహరణ .


5.పాండవుల తల్లి అయిన కుంతిదేవి అసలి పేరు పృథ.ఆమె శ్రీకృష్ణుని మేనత్త.పిల్లలు లేని తన తండ్రి సహోదరులైన కుంతిభోజునికి దత్తత గా వెళ్ళిపోవటం వల్ల కుంతీదేవి అన్న పేరు వచ్చింది.


6.

మన ఇతిహాసాలలో సమయాన్ని లెక్కించడానికి వేర్వేరు కొలమానాలు ఉన్నాయి.

ఒక మన్వంతరం లో 71 మహాయుగలు ఉంటాయి.ప్రతి మహాయుగాన్ని నాలుగు యుగాలుగా విభజంచబడ్డాయి.అవి:కృత , త్రేత,ద్వాపర,కలి యుగాలు. చెప్పబడిన క్రమం లో ప్రతి యుగం యొక్క నిడివి 4800,3600,2400,1200 దైవ సంవత్సరాలు. ఒక దైవ సంవత్సరంలో 360 మానవ సంవత్సరాలు ఉంటాయి. ఈ యుగాలలో మనలోని దయ ,కరుణ,సంతసం, నీతి భావాలు అవరోహణ క్రమం లో ఉంటాయి.మనం ప్రస్తుతం కలి యుగలో ఉన్నాం. కొందరి అభిప్రాయం ప్రకారం కలి యుగం మహాభారత యుద్ధం జరిగిన 3120 క్రీ. పూ. నుంచి మొదలయింది.


7.ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుడి దగ్గరున్న మూడు బాణాలకు ఒక్క నిమిషం లో యుద్ధాన్ని ముగించగల శక్తి ఉంది.అలాగే తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తను బలహీనుల పక్షాన పోరాడతానని,తన పక్షం బలం పెరిగితే, ఎదుటివారి పక్షాన ఉంటానని మాట ఇస్తాడు.ఇలా అయితే ధర్మం గెలవదని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుని రూపం లో వెళ్లి యుద్ధం కోసం మొదటి బలి గా తన తల నారికివేయగా,ఆ తల తో యుద్ధమంతా వీక్షించి దేవలోకం చేరుతాడు.


8.

శిఖండి గా మారిన శిఖండిని,ద్రుపదుని కుమార్తె,ద్రౌపది సోదరి.తన ఇంటి గుమ్మానికి వేలాడుతున్న ఒక నీలికలువ మాలని చూసి,అది గత జన్మలో అంబ అయిన తనకి సుబ్రహ్మణ్య స్వామి భీష్ముడిని సంహరించడానికి ఇచ్చిన మాలగా గుర్తించి,ఒక యక్షుని తో తన లింగాన్ని మార్చుకొని యుద్ధం చేసింది.




9. యుద్ధం లో సర్వసైన్యాధ్యక్షులు:

కౌరవ సైన్యం:భీష్మ -- 1-10 రోజులు,ద్రోణాచార్య --11-15 రోజులు,కర్ణ -- 16-17 రోజులు,శల్య -- 18 వ రోజు(పగలు)అశ్వద్ధామ -- 18 వ రోజు(రాత్రి).

పాండవ సైన్యం: ధృష్టద్యుమ్నుడు.


10.శ్రీకృష్ణుని శంఖాన్ని పాంచజన్యము అంటారు.అలాగే ధర్మరాజు యుధిష్ఠిరుని శంఖాన్ని అనంతవిజయ గా,బలవంతుడు భీముని శంఖాన్ని పౌండ్రం అని అంటారు.ఇంద్రపుత్రుడు అర్జునుని శంఖాన్ని దేవ దత్త అని ,నకుల సహదేవుల శంఖాలని మణిపుసక అని, సుఘోష అని పిలుస్తారు.



11. మన పురాణాలలో ఉండే మరో కొత్త అంశం 14 భువనాలు లేదా 14 లోకాలు.వీటి గురించి మనం తరచుగా అడిగే ఉంటాం. ఆ 14 లోకాలు: సత్య లోకం, తప లోకం,జన లోకం,మహర్లోకం,స్వర్లోకం ,భువర్లోకం,భూ లోకం,అతల లోకం, వితల లోకం, సుతల లోకం, తలాతల లోకం, మహాతల లోకం,రసాతల లోకం, పాతాళ లోకం.


12.మన భారతీయ పురణాల్లో ఐదుగురు పంచ కన్యలు ఉంటారు.వాళ్ళు:

గౌతమమహర్షి భార్య అహల్య, కిష్కిందకు మహారాణి,వాలి భార్య తారా, రావణాసురుని భార్య ఐనటువంటి మండోదరి, శ్రీరామచంద్రుని భార్య..జనకునిపుత్రికసీత, పాండవుల భార్య పాంచాలి ద్రౌపది.గమ్మత్తైన విషయం ఏమిటంటే వీళ్ళకి పెళ్లి అయినప్పటికినీ కన్యలుగానే పరిగణిస్తారు.

Comentarios


bottom of page