top of page

What is Recission? | Article in Telugu

Writer's picture: ManisharanManisharan

- Mohita Priya, EEE, NIT Trichy

ఆర్ధిక మాంద్యం(recession) - ఈ పదాన్ని ఇటీవల కాలంలో పత్రికల్లో, టీ.వీల్లో మరియు అంతర్జాలంలో చూసే ఉంటారు. మనలో చాలామందికి దాని గురించి అవగహన లేదు. ఈ నవయుగంలో దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం.


ఆర్ధిక మాంద్యం అనగా ఏమిటి ?

స్థూల దేశీయ ఉత్పత్తి వరుస త్రైమాసికంలో నెగటివ్లో వచ్చి, దానితో పాటు నిరుద్యోగ రేటు తగ్గు ముఖం పడితే దానిని ఆర్ధిక మాంద్యం అంటాము. ఒక దేశం ఉత్పత్తిని స్థూల దేశీయ ఉత్పత్తి(GDP) ఉద్యోగం, పెట్టుబడి ఖర్చు, సామర్థ్య వాడకం, ఇంటి ఆదాయం, వ్యాపార లాభాలు, ద్రవ్యోల్బణం మొదలగున వాటితో లెక్కిస్తారు.


ఆర్ధిక మాంద్యం వలన వచ్చే పరిణామాలు ?

  • వాణిజ్యం ,వ్యాపార లావాదేవీలు నిలిచిపోతాయి.

  • ఆర్ధిక ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది.


ఆర్ధిక మాంద్యం మూడు రకాలుగా సంభవిస్తుంది -

ఓవర్ హీటెడ్ ఎకానమీ - ఎప్పుడైతే ఒక దేశంలో లేదా ప్రపంచంలో డిమాండ్ మరియు సరఫరా మధ్య అసముతుల్యత ఏర్పడినప్పుడు ఆర్ధిక మాంద్యం సంభవిస్తుంది. దీని వలన రోజువారి సరుకుల రేటు నుండి బంగారం రేటు వరకు పడిపోతుంది. దీని వలన ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల బ్యాంకులో రుణాల రేటు అమాంతంగా పెరిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ద్రవ్యోల్బణం(inflation) పెరుగుదల ఈ రకమైన ఆర్ధిక మాంద్యం సంభవించడానికి ప్రధాన కారణం.

బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ - ప్రపంచంలో అనూహ్య సంఘటనలు జరిగినప్పుడు ఉదాహరణకు (రష్యా యుక్రెయిన్ వార్, కోవిడ్, ప్రకృతి విపత్తులు మొదలయినవి. దీని వలన డిమాండ్ పెరిగిపోతుంది సరఫరా తగ్గిపోతుంది. ఇవన్నీ ఆర్ధిక మాంద్యానికి కారణం.

అసెట్ బబుల్స్ - ధరల పెరుగుదల మరియు తగ్గుదల ఆ దేశం యొక్క ప్రపంచ బ్యాంకు రుణాలు మీద ఆధారపడతుంది. ఆ రుణాలు తీర్చడానికి ఆ దేశం పన్నులు పెంచుతుంది, పన్నులు పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి ఆస్తులు, బంగారం మరియు షేర్స్ ఒక్క ధరలు రేటు అమాంతంగా పెరగడం వల్ల, అది ఒక స్టేజ్ చేరుకున్నాక అమాంతంగా పడిపోతుంది. ఎందుకంటే రేటులు పెరగడం వల్ల ఎవరు ముందుకు రారు వాటిని కొనుగోలు చేయడానికి, కొనుగోలు కొనసాగకపోతే వ్యాపార లావాదేవీలు జరగవు. ఇలా జరగడం వలన 16 సంవత్సరాలు క్రితం ఆర్ధిక మాంద్యంని ఎదుర్కొన్నాం.

ఇప్పుడు వచ్చే ఆర్ధిక మాంద్యం కంటే ముందు 2008 లో గ్రేట్ రెసెషన్(great recession) వచ్చింది. ఇది ఎలా వచ్చింది అంటే అమెరికాలో 2001 లో సాఫ్ట్వేర్ కంపెనీలు యొక్క స్టాక్స్ పడిపోవడం, అలాగే బ్యాంకులో రుణాలు తక్కువ ఉండడం వలన ప్రజలకు తమ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని సందిగ్ధంలో పడిపోయారు. అప్పుడే రియల్ ఎస్టేట్ వచ్చింది, అందరూ తమ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. రియల్ ఎస్టేట్ విలువ పెరగడం బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరి పెట్టుబడులు పెట్టేవారు, అప్పులు పెరగడం వాళ్ళ బ్యాంకు వడ్డీ రేటులను పెంచింది. హౌస్ లోన్స్ ఇవ్వడానికి మాత్రమే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు మొదలైయ్యాయి. అలా ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు అన్నింటిలో లెహ్మెన్ బ్రదర్స్ బ్యాంకు చాలా పెద్దది.

ఎక్కువ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో పెట్టడం వలన సరఫరా తగ్గిపోయింది. అలాగే ప్రజలు బ్యాంకులకు వడ్డీ కూడా కట్టలేకపోవడం వలన, బ్యాంకుల దగ్గర డబ్బు లేకపోవడం వలన ఆర్ధిక మాంద్యం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రిసెషన్ లెహ్మెన్ బ్రదర్స్ బ్యాంకు భారీగా దివాళా తీశారు, అందుకనే ఈ రిసెషన్ కి లెహ్మెన్ బ్రదర్స్ రిసెషన్ అని కూడా పేరు.

ఇప్పుడు రాబోయే ఆర్ధిక మాంద్యానికి చాలా కారణాలు ఉన్నాయి -

ఊహించని విధంగా వచ్చిన కరోన, అనూహ్యంగా వచ్చిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇవన్ని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని మార్చబోతున్నాయి.

కరోనా వల్ల కొన్ని నెలలు పాటు ప్రపంచం స్తంభించిపోయింది. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో పలు లావాదేవీలు నిలిచిపోయాయి. జి .డ్. పి పడిపోయింది, ఆదాయం తగ్గిపోయింది. ఇది తగ్గుముఖం పట్టగానే, రష్యా - ఉక్రెయిన్ లు మధ్య నిప్పు రాజుకుంది.

ఉక్రెయిన్ నాటోలో చేరదాము అనుకుంటున్నపుడు, రష్యా తిరస్కరించింది. రష్యా తిరస్కరణ ఉక్రెయిన్ గౌరవించకపోవడం వల్ల రష్యా తన బలం నిరూపించుకోవడం కోసం యుక్రెయిన్ మీదకి దండయాత్రకి వచ్చింది. దీని వలన రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలయింది. యుద్ధం వలన ఆ ఇరు దేశాలు తమ వనరులు యుద్ధం కోసమే మాత్రమే ఉపయోగిస్తున్నాయి. మరో పక్క రష్యా ఆదాయం కోసం నాటోలో లేని దేశాలకి మాత్రమే సరఫరా చేసింది. దీని వలన నాటో దేశాలు యొక్క వనరులు తగ్గిపోయాయి. దీనితో పాటు యూరోప్ దేశాలలో బ్యాంకు రుణాల సంక్షోభం మొదలయింది. వీటి వలన అమెరికా జి .డి .పి ఈ త్రైమాసికంలో నెగటివ్ లో పడిపోయింది .

దీని వలన మన దేశానికి వచ్చే నష్టం ఏమిటి అని మీరు అనుకోవచ్చు

అమెరికా భారత దేశం యొక్క ప్రధాన దిగుమతిదారు. అమెరికాలో జి. డి. పి తరుగుదల వలన దిగుమతులు మీద పన్నులను పెంచుతుంది. వాటిని పెంచడం వల్ల, మనం డాలర్స్ లో ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. మన దేశం డాలర్స్ ని ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటుంది. రూపాయిలను డాలర్స్ లోకి మార్చడానికి మన దేశం ప్రపంచ బ్యాంకుకి వడ్డీ కడుతుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు రేటు పెంచడం మన దేశ కరెన్సీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీని వలన రూపాయి యొక్క విలువ పడిపోతుంది. రూపాయి విలువపడిపోవడం వల్ల, నిత్యావసర వస్తువుల రేటులు నుండి బంగారం రేటులు వరకు అన్ని పెరిగిపోతాయి. దీని వల్ల ఒక రకంగా మన దేశం లో కూడా ఆర్ధిక మాంద్యం మొదలు అవచ్చు.


ఆర్ధిక మాంద్యాన్ని ఎలా నివారించచ్చు

  • బ్యాంకు వడ్డీ రేటులు పెంచడం వల్ల , ప్రజలలోకి డబ్బు వెళ్ళదు. ఎందుకంటే రుణాలు పెరగడం వలన ప్రజలు లోన్లు తీసుకోరు. అప్పుడు డబ్బులు చేతులు మారదు.

  • ప్రభుత్వం పరిశ్రమలకి చేయూతగా ఉండాలి.పెద్ద పరిశ్రమలు (అమెజాన్ ,మైక్రోసాఫ్ట్ మొదలైనవి ) ఈ సమయం లో లేఆఫ్స్ (ఉద్యోగులను తీసివేస్తాయి ) చేస్తాయి. అలా లేఆఫ్స్ చేయకుండా ప్రభుత్వం సబ్సిడీస్ ఇవ్వాలి.

Comments


bottom of page