Akshara Content Team
Are you interested in writing short content, stories, poems, tales, dialogues, one-liners, etc. ? Publish your work with us. Mail your works to marketing.aksharanitt@gmail.com or do WhatsApp to +91 8374434782 or +91 9849420102 or +91 7993575247
"రక్ష! నా స్వేచ్ఛకు నీ ఉత్తరువులే నా రక్ష!
నా ఉద్దేశాలకు నీ అనుమతులే నా రక్ష!
నా ఆశయాలకు నీ ప్రోత్సాహమే నా రక్ష!
నా ఇష్టాలకు నీ విలువలే నా రక్ష!
నా కలలకి నీ స్వతంత్రమే నా రక్ష!
నా మనసుకి నీ ప్రేమే నా రక్ష!
నా ప్రపంచానికి నీ చెలిమే నా రక్ష!
నా జీవితానికి అన్నగా నీ బంధమే నా రక్ష!
నా అన్న!! నా రక్ష!!
- K. Madhupriya
Sri Durga malleswara
siddartha mahila kalasala, Vijayawada
"అనుబంధాల ఆత్మీయతకీ పట్టం కడితే
అన్నచెల్లిల బంధం చక్రం తిప్పుతది.
చీటికీ మాటకి చిదరింపులతో,
కొట్టుకున్న కోటి విలయలు
తిట్టుకున్నా లక్ష ప్రళయాలు,
లెక్కలో లేని అలకలు,
సర్ది చెప్పుకోలేని సమయాలు,
ఆంక్షలు లేని ప్రేమకీ
అడ్డుకట్ట వేసే రక్షాబంధన్.
ఇంటికి రారాణి నా చెల్లి
నీవు లేని కోట ఎడారి.
ఆపదలు ఎన్ని ఎదిరించిన,
వదంతులు వెయ్యి వచ్చిన,
ఆంగ రక్షణగా అన్నాగా నా బాధ్యత."
- Srujan Kumar
"నా మౌనాన్ని జయిస్తావు
నా ఆవేశాన్ని చూపిస్తావు
నా హాస్యాన్ని ప్రేరేపిస్తావు
నా గమనాల్ని సరిచేస్తావు
నా భాదని గుర్తిస్తావు
ప్రశ్నకి సమాధానమై బదులిస్తావు
ఆది నుండి అంతిమ వరకు నీ మాటకి బదులు చెప్పే ప్రతి అక్షరం నేనే అవుతా
రక్త సంబంధాలు ఎన్ని ఉన్న ఆత్మకై పుట్టే బంధానికి మనమే నిదర్శనం కావాలి రక్షాబంధన్ శుభాకాంక్షలు ❤️"
- Sai Kiran
నేడు పాప్ సంగీత ప్రపంచానికి శతాబ్దాలపాటు రాజుగా నిలిచిన మైకిల్ జాక్సన్ యొక్క పుట్టినరోజు.డాన్స్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఆరాధ్యదైవం. మ్యూజిక్ లో అత్యుత్తమ అవార్డు గా చెప్పుకునే గ్రామీ అవార్డు పొందడం ఎంతో గొప్ప.... అటువంటిది మైకల్ జాక్సన్ ఏకంగా 13 గ్రామీ అవార్డుల గ్రహీత. జాక్సన్ మనందరినీ వదిలి 12 సంవత్సరాలు అయినా ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో ఉంటాడు. కింగ్ జాక్సన్ బహిరంగ ప్రదర్శన ను లక్షలు జనం వీక్షించే వారు. అతను మైకు పట్టుకుంటే అభిమానులు అరుపులతో రంగస్థలం నిండిపోయేది.అటువంటి మైకేల్ జాక్సన్ యొక్క పుట్టినరోజుని అక్షర తో పాటు జరుపుకోండి
- Satya Sai Srinivas
Instrumentation and Control engineering
NIT Tiruchirappalli, Tamil Nadu
మాతృ భాష నెపుడ మరువకు సోదరా(సోదరీ)
మాతృ భాష నెపుడు మహిని యందు
మాతృ భాష మరుపు మనిషికి చేటౌను
మాతృ భాష తెలుగు మనది కదర
మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
- T. Siva naga Santosh Kumar
M.A.. Department of Telugu
Andhra University, Visakhapatnam