
ముందుమాట: మీరు గాని, మీ మిత్రులు గాని Depression తో ఇబ్బంది పడుతుంటే గనుక, జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఆనందంగా ఉండాలి అనుకుంటే గనుక...
ఈ పోస్ట్ ని చివరివరకు చదవండి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్... మన జనరేషన్ అందరికి సుపరిచితమైన పేరు. ఎంతో కష్టపడి, తనకంటూ మంచి పేరు సంపాదించుకొని, భారత యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన. అటువంటి అద్భుతమైన విజయ-ఖ్యాతులని పొందిన వ్యక్తి, Depression తో ఆత్మహత్యకి పాల్పడడం చాలా బాధ కలిగించే విషయం. "ఈ Depression ని మనం ఎలా ఎదుర్కోవాలి?
మన స్నేహితులని ఈ Depression బారి నుంచి ఎలా కాపాడాలి ?", అనే అంశం పై అందరూ ఆలోచించవలసిన అవసరాన్ని, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ యొక్క విషాద గాథ మన అందరికి గుర్తుచేసింది.

"భగవద్గీత", భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన self-help book. ఆనందంగా ఉండటానికి ఇందులో ఎన్నో మార్గాలను శ్రీ కృష్ణుడు అర్జునుడికి విశదీకరించారు. 18 అధ్యాయాలు గల ఈ గ్రంధం లో ప్రతి అధ్యాయం ఒక "యోగం" గురించి చెబుతుంది. "మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలి?" అనే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి భగవద్గీత యొక్క సారం తెలియడం ఎంతో అవసరం. కనుక, భగవద్గీతలో చెప్పిన విషయాల ద్వారా ఏ విధంగా మన జీవితాలను ఆనందమయంగా మార్చుకోవచ్చో, ఈ సంపాదకీయం ద్వారా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ సూచనలను మనం మన జీవితాల్లో ప్రయోగిద్దాం... మన బంధు మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి, అందరికి మంచి జరిగేలా, వారు depression లో ఉంటే కనుక, వారిని అందులో నుంచి బయటకు తీసుకొచ్చేలా పాటుపడదాం.

Mathematics లో ఏ problem solve చెయ్యాలి అన్నా we use a formula. Similarly, life లో ఆనందంగా ఉండడానికి మనకి భగవద్గీత "DISC" ఫార్ములా ని icchindi.
D - Detachment - వైరాగ్యం
I - Involvement - ప్రమేయం
S - Self Respect - విశ్వాసం
C - Contentment - సంతృప్తి
DETACHMENT- వైరాగ్యం

మన అందరికీ external sources నుంచి ఆనందాన్ని పొందాలని అనుకుంటాం. ఫలితం మనకి అనుకూలంగా వస్తే ఆనంద పడతాం. ఒకవేళ ఫలితం మనం అనుకొనట్టు వచ్చినట్లయితే వెంటనే కృంగిపోతాం. ఇదే మనల్ని మనో వేదనకు గురిచేస్తుంది. మరి దీని నుండి ఎలా బయటపడడం?
“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||” (6-35)
తాత్పర్యం
“అర్జునా, నిస్సందేహంగా మనస్సనేది చంచలమైనది. మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చును. ”
"Practise makes man perfect" అనే నానుడి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కానీ, అభ్యాసంతో పాటు వైరాగ్యాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. దేనికీ ఎక్కువ అటాచ్ అవ్వకుండా, తామరాకుపైన నీటి బిందువు లాగా అంటి అంటనట్టు ఉండాలి. అది మనిషైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు.
INVOLVEMENT - ప్రమేయం

కాలాన్ని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలుగా మూడు రూపాల్లో అవగతం చేస్కోవచ్చు...
మనం ఆలోచించి చూస్తే ఒక్క వర్తమానం ఒక్కటే మన చేతుల్లో ఉంది. కానీ మనం మన జీవితంలో ఎక్కువ శాతం గడిచిపోయిన కాలంలో జరిగిన చెడు జ్ఞాపకాలని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేని అంశాలగురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఈ క్రమంలో మన చేతుల్లో ఉన్న "ఈ క్షణాన్ని" మర్చిపోతున్నాము.
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।।" (2.47)
తాత్పర్యం
“శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.“
పని చెయ్యడం వరకే మనకి వెసులుబాటు ఉంది... దాని ఫలితం మీద కాదు. ఏ పని చెయ్యాలి?
ఏ పని చెయ్యకూడదు ? మీరు ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి. ఆగి, మీ హృదయాన్ని ఓసారి ప్రశ్నించుకోవాలి. "ఈ నిర్ణయం నేను స్వార్థంతో తీసుకుంటున్నానా ? లేక నా బాధ్యతలో భాగంగా తీసుకుంటున్నానా?" సమాధానం కనుక "స్వార్థం" అయితే... ఆపని చెయ్యొద్దు. స్వార్థంతో చేసే పనులు ఆ క్షణంలో ఆనందాన్ని ఇచ్చినా తరువాత బాధ పెడతాయి. అదే, సమాధానం కనుక "బాధ్యత" అయితే... వెంటనే ఆ పని చెయ్యండి. బాధ్యతతో తీసుకున్న నిర్ణయం ముందు ఇబ్బంది పెట్టినా... తరువాత మంచి చేస్తుంది.
SELF-RESPECT - విశ్వాసం

సామాజిక మాధ్యమాలు మనకి మంచి కన్నా చెడే ఎక్కువ చేశాయని నా అభిప్రాయం. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఉంటేనే ఆనందం వుంటుంది అనే భ్రమని మనలో సృష్టించాయి. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఆనందానికి కొలమానం కాదని అనడానికి సుశాంత్ సింగ్ ఆత్మహత్యే నిదర్శనం.
Contentment & Excitement అనేవే ఆనందంగా ఉండడానికి అవసరం అనడానికి Zomato delivery boy యోక్క చిరునవ్వే సాక్ష్యం.

వేరే వాళ్ళ జీవితాలు మీద పెట్టే శ్రద్ధలో ఇసుమింతు శ్రద్ధ మనం చేయాల్సిన పని మీద పెడితే, మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
"శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।।" (3.35)
తాత్పర్యం
ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.
స్వధర్మం అంటే మనం చేయాల్సిన పని. పర ధర్మం అంటే వేరే వల్ల గురించి Gossips. స్వధర్మం మీద దృష్టి పెడదాం. మనకున్న దానితో ఆనందంగా ఉందాం. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనల్ని ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడాలి. దీనికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ధ్యానం చేసే సమయంలో మనం మన Distractions నుంచి మన మనస్సుని మరలించడానికి ప్రయత్నిస్తాం. మనం రోజూ చేసే ధ్యానం, మన నిత్య జీవితం లో మన చుట్టూ ఉండే అనవసర విషయాల నుంచి మన మనస్సుని కాపాడుకునేందుకు చేసే సాధన లాంటిది. అందుకే, ధ్యానం చెయ్యడం అలవాటు చేసుకోండి.
CONTENTMENT - సంతృప్తి

కరోనా కారణంగా ఇన్నాళ్లూ మనం పెద్దగా పట్టించుకోని సామాజిక సమస్యలన్నీ మనకు తెలుస్తున్నాయి. మన భారత దేశం గొప్పది అని చెప్పుకుంటాం. కానీ 22 % భారతీయులు పేదరికంలో ఉంటూ, మూడు పూటలా అన్నం దొరకని పరిస్థతుల్లో ఉన్నారు. వలస కార్మికులు భుజం మీద ఆకలితో ఉన్న పిల్లల్ని మోసుకుంటూ.. వేల కిలోమీటర్లు నడుచుకునే పోతున్నారు. వారికున్న సమస్యల ముందు మన సమస్యలు ఎంత చెప్పండి ?
భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు, కానీ మనం నిరంతరం మనకు లేనిదాని కోసం ఆలోచిస్తూ... మన పక్కనే ఉన్న విలువైన విషయాలని చులకన చేసుకుంటాం... మన విజయాలను తక్కువ అంచనా వేసుకున్నాము.
"ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।।" (6.5)
తాత్పర్యం
నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.
నిన్ను నువ్వు నమ్ముకో, నీ మనసే నీ మిత్రుడు.. నీ మనసే నీ శత్రువు కూడా.. కాబట్టి,
నీ ఆలోచనలని అదుపుచేస్కో...
నీకున్న వాటితో సంతోషంగా జీవిచగలగడం నేర్చుకో..
మరి మనకున్న వాటితో సంతృప్తి చెందితే అభివృద్ది ఎలా చెందగలం అనే ప్రశ్న మీకు రావచ్చు. అభివృద్ది అనేది Quantity పరంగా కాకుండా... Quality పరంగా చెందాలి. మన ఆలోచనలు సమాజానికి మేలు చేసేలా ఉండాలి.
CONCLUSION
చివరిగా... మనం...
"ఖరీదైన వస్తువులు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి...
ఎక్కువ ఉంటేనే మంచిది...
స్వార్థమే మనకి పేరు తెస్తుంది...
మొదట దండుకున్నాకే దానం చేద్దాం"
అనే దృక్పథం నుంచి...
"చిన్న చిన్న విషయాలే ఆనందాలు...
తక్కువే మంచిది.. పంచుకొడమే దానం...
మరియు భిన్నత్వం అనేది ఎంతో ఆవశ్యకం" అనే దృక్పథానికి మారాలి...

Comentarios