top of page

ఘుమఘుమలు

Writer's picture: Akshara NIT TrichyAkshara NIT Trichy

వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్:

కావలసిన పదార్థాలు: ఉడికించిన బియ్యం, ఆలివ్/సన్‌ఫ్లవర్ నూనె, కారం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, సోయా సాస్, వెనిగర్, డైస్డ్ స్ప్రింగ్ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్, తగినంత ఉప్పు, స్కీజ్వాన్ పౌడర్.

తయారు చేసే విధానం: పాత్రలో 30 మి.లీ నూనె పోసి వేడి చేయాలి. ఒక కప్పు ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు వేసి కొద్దిసేపు వేడి చేయాలి. తరువాత కొంచెం వెనిగర్ వేసి 500 గ్రాముల ఉడికించిన బియ్యం వేసి కలుపుతూండాలి.రుచికి ఒక టీస్పూన్ సోయా, ఉప్పు మరియు కారం పొడి వెయ్యాలి. మీకు కావాలంటే మీరు మరింత కారంగా ఉండటం కోసం స్కీజ్‌వాజ్న్ పౌడర్‌ను వేసుకోవచ్చు. ముక్కలు చేసిన కూరగాయలను వేసి నిరంతరం కలపాలి.అంతే ఘుమఘుమలాడే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.





గోధుమ పిండి అట్లు:

కావలసిన పదార్థాలు: గోధుమ (ఆటా), నూనె, ఉప్పు, మిరప పొడి, టమోటా పచ్చడి, పెరుగు, ఉల్లిపాయలు.

తయారు చేయు విధానము: ఒక పెద్ద గిన్నెలో 300 గ్రాముల గోధుమలను తీసుకొని, నూనె వలె జిగట వచ్చేవరకు నీరు కలపండి. రుచికి ఉప్పు మరియు కారం వెయ్యండి. మంచి రుచి కోసం మీరు జీలకర్ర ని వేసుకోవచ్చు.నొంచుకోవడం కోసం, ఒక చిన్న గిన్నె తీసుకొని 2 టీస్పూన్ల టమోటా పచ్చడి వెయ్యండి. పెరుగు వేసి బాగా కలపాలి, కొంచెం మెత్తగా అవ్వడం కోసం కొద్దిగా నీరు కలపండి. రుచి కోసం కావాలంటే ఉల్లిపాయలను కలుపుకోవచ్చు.పిండితో దోస తయారు చేసుకుని పచ్చడితో ఆనందించండి.





వెజిటబుల్ నూడుల్స్:

కావలసినవి: ఉడికించిన నూడుల్స్, క్యారెట్, ఉల్లిపాయలు, బఠానీలు, టమోటా, క్యాప్సికమ్, వెనిగర్,నూనె


తయారు చేసే విధానం: మసాలా వెయ్యకుండా నూడిల్ ఉడకబెట్టండి. ఉడికించిన నూడుల్స్ తీసి అదనపు నీటిని తీసేయాలి. ఒక పాత్ర తీసుకొని కొంచెం నూనె పోసి,వేడి చేసి, ఆపై క్యారెట్ ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఒక్కొక్కటిగా కలపండి. ప్యాక్‌తో ఇచ్చిన మసాలా వేసి కలపాలి. కొంచెం వెనిగర్ వేసి వేడి చేయాలి. తరువాత ఉడికించిన నూడుల్స్ మరియు 20 మి.లీ నీరు వేసి కలపండి. రుచికి బఠానీలు వేసుకోవచ్చు.




Comments


bottom of page