
బాల్యం ఒక అద్భుతమైన వరం. తలపుకు రాగానే చిరునవ్వు తెచ్చే ఆ జ్ఞాపకాలు మధురం. బాల్యం గుర్తుకొస్తే చాలు భారంగా ఉన్న మనసు తేలిక అవుతుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని వారుండరు.
బాలలు అంటే బడి పిల్లలు మాత్రమే కాదు ఆర్థిక స్థితిగతులు కిందికి కూరుకుపోయి బడికి దూరమై బతుకు భారాన్ని చిన్నతనం నుంచే మోస్తూ భవిష్యత్తు అంటే ఏ పూటకి ఆ పూట పొట్ట గడవడం అనే బలవంతపు పరిస్థితిలో ఉన్న వారు కూడా బాలలే.
భారతదేశంలో బడి లేని వీధి ఉంటుందేమో కానీ బాల కార్మికులు లేని వీధి ఉండదు. నిరక్షరాస్యత వారి ఆర్థిక పరిస్థితులు బాల కార్మికులు తయారవ్వడానికి ముఖ్య కారణాలు.ఈ పిల్లలు తల్లితండ్రుల ప్రేమకు, తోటి పిల్లలతో ఆటలు ఆడటానికి, బాల్యాన్ని ఉల్లాసంగా గడపడానికి నోచుకోవడం లేదు.చాలా మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు.
బాల కార్మికులు గా ఉన్న పిల్లల చేత యజమానులు 18 గంటలకు పైగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.అంతే కాదు వారికి వచ్చే సంపాదనతో గంజాయి, గుట్కా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలు అయ్యి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. అవగాహన లోపంతో వ్యభిచారాలు, లైంగిక దాడులు, ఇంకా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలు అయితే వ్యభిచార కూపంలోకి దిగి లైంగిక వేదింపులు ఎదుర్కొని సమాజం దృష్టిలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

నల్లజాతి సూరీడు, భారత రత్న గ్రహీత అయిన నెల్సన్ మండేలా గారు విద్యకు ఉన్న శక్తి ని తెలుపుతూ "ప్రపంచాన్ని మార్చాలంటే పదునైన ఆయుధం చదువు ఒక్కటే" అని అన్నారు.రోజు రోజుకీ పెరుగుతున్న బాల కార్మికులను నియంత్రించడానికి బాలల హక్కు చట్టం , ఫ్యాక్టరీ చట్టం చేశారు.ఆ తరువాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లని పనిలోకి తీసుకోకూడదు అని 1986 లో బాల కార్మిక నిషేధ చట్టం చేశారు.దేశాన్ని అభివృద్ధి వైపు మార్చాలంటే అది విద్యావంతుల వల్లే సాధ్యమవుతుంది అని గుర్తించిన భారత ప్రభుత్వం ధనిక, పేద తేడా లేకుండా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఉచిత నిర్భంధ విద్యను అందించడానికి 86 వ రాజ్యాంగ సవరణ ద్వారా "విద్యాహక్కు 2002" ని ప్రాథమిక హక్కుల్లోని 21A లోకి చేర్చింది.ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రభుత్వానికి తోడుగా కొన్ని ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు బాలల పరిరక్షణ కోసం పాటుపడుతున్నాయి.అయినా ఇంకా గుట్టుగా కొన్ని మాఫియాలు తల్లితండ్రులను కోల్పోయి అనాథలు అయిన పిల్లలను , మిగితా పిల్లలను అపహరించి ఫ్ఫ్యాక్టరీలలలో పనిలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసి వారి కర్కశత్వానికి బలిచేస్తున్నరు.
నేటి బాలల భవిష్యత్తు రేపటి దేశపు భవిష్యత్తు కాబట్టి ,ప్రభుత్వం అధికారులు బాల్య కార్మికులు నివారణకు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలి.ప్రతి పౌరుడు దీనిని ఒక బాధ్యతగా భావించాలి.ఎవరైనా పిల్లలు భిక్షమెత్తుకుంటూ ,కిరాణా కొట్టులు పరిశ్రమలు లో పనిచేస్తున్నట్టు కనిపించిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలి అని కోరుకుంటూ ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి అర్థాన్ని చేకూర్చడానికి "అక్షర" తరపున మా ఈ చిన్ని ప్రయత్నం.
Follow our Instagram channel for more content like this:
Comments