- Thrinesh, Satya Sai Srinivas, NIT Trichy
నేడు ఒక మహా యోధుని పుట్టినరోజు
ఎవరు "జై హింద్" అని సైనికుల గుండెల్లో ధైర్యం నింపగలడో...
ఎవరి పేరు చెప్తే నాడు బ్రిటిష్ సేన గజగజ వణికి ఉలిక్కిపడిoదో...
ఎవరు భారత సైన్య బలాన్నీ ప్రపంచానికి చాటి చెప్పారో...
అతడే సుభాష్ చంద్ర బోస్ నేటికీ.... ఎప్పటికీ సైనికులకు ఆదర్శ ప్రాయుడు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఘోర యుద్ధంలో తుపాకీ పట్టి పోరాడిన సుభాష్ చంద్ర బోస్ కు నేతాజీ అనే పేరు భారతీయ ప్రజల గుండె లోతుల్లో నుండి వచ్చింది.స్వాతంత్ర్య పోరాటం కోసం ఏడు ఖండాల నుండి సైన్యాన్ని పోగుచేసి బ్రిటిష్ వారికి ఏడు సముద్రాల నీటిని తాగించాడు.
బాల్యం, చదువు:
సుభాష్ చంద్ర బోస్ ఒరిస్సాలోని కటక్‌లో 1897 జనవరి 23న జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దేవి దంపతులకు జన్మించాడు. తండ్రి జానకీనాథ్ బోస్ ఒక ప్రసిద్ధ న్యాయవాది.తల్లి ప్రభావతి దేవి మతపరమైన స్త్రీ. సుభాష్ మెట్రిక్యులేషన్ పరీక్షలో రెండవ స్థానం సాధించిన ఒక తెలివైన విద్యార్థి. బోస్ తన బి.ఎ. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1918లో తత్వశాస్త్రంలో ఆనర్స్. తరువాత అతను తదుపరి చదువుల కోసం సెప్టెంబర్ 1919లో ఇంగ్లండ్ వెళ్ళాడు.
జీవిత మలుపు:
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకు స్ధానం లో నిలిచి కలెక్టర్ పదివి దక్కించుకున్నారు.పదవిని స్వీకరించటానికి వెళ్తున్న రోజు ఆ ఊరి ప్రజలు ఎంతో ఆప్యాతతో ఆహ్వానించారు. అది బ్రిటిష్ పరిపాలన ......భారతీయులు బ్రిటిష్ వారికి బానిసలుగా బ్రతికేవారు. ఇది చూసిన బోస్ గుండెల్లో తెలియని బాధ.....వెంటనే కలెక్టర్ పదవికి రాజీనామా చేసి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. ఆ సభలో గాంధీ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం దక్కాలంటే శాంతి, అహింస సరైన మార్గం అన్నారు. నేతాజీ కి గాంధీ మాటలు అస్సలు నచ్చలేదు." మనకు స్వాతంత్ర్యం దక్కాలంటే విప్లవం సరైన మార్గం.మనం వారి కంటే ఎక్కువ బలవంతులం ఐతే శాంతి, అహింస సరైన మార్గం.కాని చేతులు ముడుచుకొని ఉంటే అది చేతకాని తనం అవుతుంది " అని అన్నాడు .ఈ మాటలు విన్న సభ అంతా చప్పట్లు ,హర్షద్వానులు తో నిండిపోయింది. ఈ ప్రసంగం తో నేతాజీ ఎంతో గొప్ప పేరును సంపాదించారు.
కాంగ్రెస్ నుండి తొలగడం:
నేతాజీ దూకుడు గాంధీ కి ఏమాత్రం నచ్చలేదు. గాంధీ నెహ్రూ ల విమర్శల వల్ల నేతాజీ కాంగ్రెస్ విభాగం లో ఎక్కువ రోజులు ఉండలేదు. బోస్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ ఆ పదవికి రాజీనామా చేసి
బోను నుండి విడుదలైన సింహం గర్జిస్తూ ఒంటరి పిడుగు పంజాతో శత్రువలని ఎలా వేటడుతుందో అదే విధంగా ఒంటరి పోరాటం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో వొణుకు పుట్టించాడు.

విజయం వైపు మొదటి మెట్టు:
భారత దేశం స్వాతంత్ర దేశం కావటానికి ప్రత్యేక సైన్యం, ఇతర దేశాల సహకారం ఉండాలని నేతాజీ గ్రహించారు.ఈ దూకుడు బ్రిటిష్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసింది.కనిపిస్తే కాల్చి పారేయమని ఆదేశించింది.
హిట్లర్ మద్దతు:
అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం..... నేతాజీ బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఉన్న జర్మనీ కి వెళ్ళారు. అక్కడ నాజీ పార్టీ అధ్యక్షుడు హిట్లర్ ని కలవటానికి వెళ్లగా హిట్లర్ వచ్చి నేతాజీ నీ పలకరిస్తారు .నువ్వు కాదు ని బాస్ ని పిలువు అని అనగా అసలైన హిట్లర్ వచ్చి నేతాజీ ని భుజం మీద చేయవేసి పలకరించి బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడటానికి మద్దతు ఇస్తాడు.హిట్లర్ నన్ను ఎలా గుర్తుపట్టగలిగావ్ అని అడగగా ఈ బోస్ పై చేయవేసి మాట్లాడగలిగే దైర్యం హిట్లర్ కి మాత్రమే ఉంది అని అంటాడు.
వివాహం :
జర్మనీ కి ఆఫ్రికా యొద్ధం లో బందీలుగా ఉన్న 5000 సినికులని పోగుచేసాడు.
జర్మనీ లో ఉండగా బోస్ ఎమిలీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వారికి పుట్టిన కూతురి పేరు అనిత బోస్.
బ్రిటిష్ ఆర్మీ పై విజయం:
జర్మనీ లో ఏ విధంగా సైన్యాన్ని పోగు చేశాడో అదేవిధంగా
బర్మా , తైవాన్, హోంగకొంగ్, మలేషియా వివిధ దేశాల నుంచి 40,000 సైన్యాన్ని పోగు చేశాడు.ఇంకా
జపనీయుల మద్దతును పొంది ఇండియన్ నేషనల్ ఆర్మీ INA కి కమాండర్ గా బ్రిటిష్ వారికి పట్ట పగలు చుక్కలు చూపించాడు.
భారత జాతీయ సైన్యం సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలపై దాడి చేసి స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది.
ప్రపంచ యుద్ధం _నేతాజీ ఓటమి :
దురదృష్టవశాత్తూ జపనీయుల రెండవ ప్రపంచయుద్ధం లో లొంగిపోవడం తో నేతాజీ స్వాతంత్ర్య యుద్ధం నుండి తప్పుకోవలసి వచ్చింది. 18 ఆగస్ట్ 1945న విమాన ప్రమాదంలో ఆయన మరణించారని విశ్వసిస్తారు. ఎది ఏమైనా సుభాష్ చంద్రబోస్ తన చివరి శ్వాస వరకు దేశ స్వాతంత్ర్యo కోసం పోరాడిన మరపురాని జాతీయ వీరుడు. దేశం చూసిన గొప్ప హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకుని నేటి యువతకి స్ఫూర్తి గా నిలిచాడు.
Comments