top of page

UGADI NOSTALGIC AWARDS

Writer's picture: madhavisahi2000madhavisahi2000

అక్షర ప్రతియేటా అంగరంగ వైభవంగా ఉగాది సంబరాలను జరిపుతున్నది వాస్తవమే. ఆ వేడుకలలో భాగంగా కొన్ని అవార్డులను కూడా అందజేస్తుంది. అసలు ఈ అవార్డ్స్ ఏమిటి అనుకుంటున్నారా ? ప్రతి గ్యాంగ్ లో ' కౌశిక్ ' లాంటి వాళ్ళకి టైటిల్స్ మరియు కొన్ని బహుమతులతో సత్కరించడమే మా ముఖ్య ఉద్దేశ్యం. మరి టైటిల్స్ ఏమున్నాయని ఆలోచిస్తున్నారా !

అయితే క్రింది మా ఈ 13 ఉగాది అవార్డ్ టైటిల్స్ మరియు డిస్క్రిప్షన్ ను తప్పకుండా చదవాల్సిందే !


  • ప్రతి గ్యాంగ్ లో రచ్చ రచ్చ చేసే ' జాతిరత్నాలు ' ఉంటారు. అంతా ఇంతా హడావిడి చేస్తారా వీళ్ళు.

  • అరిటాకంత ఆశతో ' పోదాం రా.. జిం కి పోదాం ' అని రెండో రోజుకే ఆవగింజంత కారణాలతో అలిసిపోయే ' జిమ్సన్ ' లు ఉంటారు.

  • ఫ్రెండ్స్ అంతా కష్టపడి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే ఆఖరికి ' ఏ.. ప్లాన్ రా ' అని అడ్డుగోడ వేసే ఒక 'కట్టప్ప' ఫ్రెండ్ ఉండనే ఉంటాడు.

  • ' చాలా పకడ్బందీ గా ప్లాన్ చేశారు మైక్ ' అనిపించుకునే ఒక 'ప్రేమ పావురాలు' కూడా ఉంటారు .

  • వీళ్ళు నడిచి వస్తుంటేనే పులిహోర వాసన వచ్చేస్తుంది. అటువంటి 'పులిహోర రాజులు, రాణులు' కూడా ఉంటారు.

  • వీళ్ళ నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అనిపించే ' కమల్ హాసన్ ' లు, ' మహానటీమణులు ' ఉంటారు.

  • టైం కి సోషల్ మీడియాలో స్టేటస్ అప్లోడ్ చేస్తారు. క్లాస్ లెసన్స్ వినరు ఏమో గానీ సోషల్ మీడియాలో మాత్రం అన్ని టైం టు టైం ఫాలో అయ్యే ' Mr. & Ms. సోషల్ మీడియా ' ఉంటారు.

  • ప్రతి బ్యాచ్ లో ఒక అమాయకపు ' స్వాతిముత్యం ' ఉంటాడు.

  • ' ఇవెక్కడి ఆటో పంచులు రా..' అనిపించుకొనే దోస్తులకు ' ఆటోవాలాలు' కూడా ఉంటారు.

  • అలాగే ప్రతి బ్యాచ్లో ఎల్లప్పుడూ నిద్రించే వారు కూడా ఉంటారు మరి వారి కోసమే 'మత్తు వదలరా' అవార్డు.

. . . ఇలాంటి ఎందరో జాతిరత్నాలకు ఎన్నో అవార్డులు ..


అక్షర ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కొన్ని అవార్డ్స్ ను అందజేయునున్నది. కానీ ఈ టైటిల్స్ ని కొట్టడం ఎలా ?


 •  అక్షర, పైన వివరించిన అనేక టైటిల్స్ ఉండే, Nomination form రిలీజ్ చేస్తుంది. (Nomination form Link క్రింద ఇవ్వబడినది)

 •  ఆ form లో మీరు మీ ఫ్రెండ్స్ ని నామినేట్ చేయాలి.

 •  ఒక టైటిల్ కు 1-3ని మాత్రమే నామినేట్ చేయగలరు.

 • టాప్ 3 or 5 nominations ను shortlist చేసి, వాళ్ళకి ఒక Voting form ను రిలీజ్ చేస్తాము.

 •  ఈ Voting form 4 days మాత్రమే open లో ఉంటుంది.

 •  ఈ 4 days లోనే మీరు నామినేట్ చేసిన ఫ్రెండ్స్ కి ఓట్స్ వేయాలి.

 •  ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లే అవార్డు గ్రహీతలు.



NOMINATION FORM LINK:

https://forms.gle/ryH9mWX8uUBygEGk7


📌📌📌

అవార్డు గ్రహీతలకు మరియు నామినేట్ అయిన వాళ్ళకి MADMONKEY STORE వారి నుండి exciting Goodies 👕 బహూకరించబడును.

1 Comment


sanjana
Mar 28, 2021

Nice

Like
bottom of page