కాలం మారవచ్చు..
కలలు మారవచ్చు ..
మన అనుకున్న వాళ్లు మారవచ్చు...
మనతో అడుగులు వేసే వాళ్ళు మారవచ్చు....
కానీ మనం ఎప్పటికి మరువలేని మార్పు జ్ఞాపకం...
అలాంటి జ్ఞాపకం ప్రతి మనిషికి ఒక వరం,
ఒక ఆనందం, ఒక అనుభవం
, ఒక మిత్రుడు ,ఒక శత్రువు, ఒక అద్భుతం ,ఒక ప్రయాణం....
ఇలా జ్ఞాపకాలు మనకి ఎన్నో గుర్తు చేస్తూ ఉంటాయి...
మరి అలాంటి కొన్ని జ్ఞాపకాలు మనకి ఆనందాన్ని ఇచ్చి, మళ్ళీ మన అమ్మ ఒడికి తీసుకెళ్లే వాటిని గుర్తు చేసుకుందామా...
చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేవి మనం ఆడిన ఆటలు, వాటికి అయిన గాయాలు.
గల్లీ క్రికెట్ ,నాలుగు స్తంభాలాట, ఏడుపెంకులాట, దాగుడు మూతలు
, దొంగ పోలీస్ ,వైకుంఠపాళి ఇలా అనేకమైన ఆటలు...అమ్మమ్మ నానమ్మల ఏడు రాజుల కథలు..
వీటిని గుర్తు చేసుకోగానే అలా ప్రతి ఒక్కరి పదవిపై ఒక చిరునవ్వు ,అణువు
అణువులో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది
.
ఇవే కాదండి చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మనకి మన చిలిపి పనులు కూడా గుర్తుకొస్తాయి....
నాన్న సంతకం ప్రోగ్రెస్ కార్డ్ పై అనుకరించడం, అమ్మ.. కడుపు నొప్పి... నాన్న ..తలనొప్పి... అని కొంటెసాకులతో అమ్మానాన్నలను మాయ చేసి బడికి డుమ్మా
కొట్టడం
,మెల్లగా దుకాణం నుండి చాక్లెట్లు మరియు బిస్కెట్లు దొంగలించడం వీటిని గుర్తు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఒక్కసారి హృదయం చిన్నపిల్లవాడిలా గంతులు వేస్తుంది....
.... ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వాటినుంచి నేర్చుకుంటూ
అందరికి పంచుకుంటూ
...ఆనందంగా ముందుకు సాగుదాం.

Comments