Author: Surya Prakash, Civil dept.
పెద్దలు గురుదేవో భవః అని అన్నారు. గురువుని దేవునితో సమానంగా చూడటం తెలుగు వారికే కాదు భారతీయులు అందరకీ సంప్రదాయం. ప్రతీ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సెప్టంబరు 5 న భారతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. మన దేశం అభివృద్ది చెందాలి అంటే మన గురువుల వల్లనే అవుతుంది. క్రీస్తు పూర్వం నుండి, స్వాంత్ర్యం వచ్చే వరకు, రాక ముందు మన గురువులు ఎంతో మందికి నిదర్శనంగా నిలిచారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సంద్భంగా ఈ మూడు ముఖ్యమైన కాలాల లో ఉన్న ఉపాధ్యాయుల గురించి తెలుసుకుందాం.
చాణక్య (క్రి.పూ. 375 - క్రి.పూ. 283):

విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు, అని పిలవబడే చాణక్యుడు మన భారత దేశంలోనే అత్యుత్తమ గురువులలో ఒకడు. తక్షశిల విశ్వవిద్యాలయం లో ఎంతోమదిని ఉత్తమములుగా తీర్చిదిద్దారు. రాజకీయశాస్త్రం, ఆర్ధికశాస్త్రం లో ఎంతో జ్ఞానం ఉన్నవాడు. చాణక్యుడు చంద్రగుప్తమౌర్య నికి శిక్షణ ఇచ్చి మగధ రాజ్యానికి అర్హతమైన రాజుని చేశాడు. అలెక్సాన్డర్ వంటి రాజుని దేశం ఏలడం నుంచి కాపాడారు . "అర్థశాస్త్రం" అని ఇతను రచించిన పుస్తకం ఇప్పటికీ ఎంతో మంది అర్థశాస్త్ర విద్యార్థులకు ఆదర్శం. దేశపరిపాలన న్యాయంగా జరగుట కొరకు ఇతను రాజ్యాంగం అనే పాటించ వలసిన నియమాలకు పుస్తకరూపం ఇచ్చాడు.
గౌతమ బుద్ధుడు(క్రి.పూ. 563 - క్రి.పూ. 480):

సిద్ధార్థ గౌతముడు ప్రపంచం మొత్తం తెలిసిన భారత గురువులలో ఒకడు. భౌధ్ధమత స్తాపికుడైన బుద్ధుడు అందరికీ నమ్మకం, స్వీయ సాక్షాత్కారం గురించి తెలిపాడు. తన ఆదర్శ తత్వశాస్త్రం మన దేశం లోనే కాక ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. తన శాస్త్రాలు వల్ల ఎంతో మంది ప్రజలకు వాళ్ల జీవితం పైన కొత్త దృష్టికోణం కలిగించారు. భౌద్ధ భోదనలు సార్వత్రిక మైనవి. ధర్మచక్ర వంటి భోదనలకి ఎంతో విలువని ఇస్తారు.
మదన్ మోహన్ మాలవ్య (1861 - 1946):

మహామనా అని పిలవబడే పలుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులైన మదన్ మోహన్ మాలవ్య గారు ఆధునిక ఉపాధ్యాయులలో చాలా ముఖ్యమైనవారు. ప్రతిభావంతులైన వక్త, అతను ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య వంటి విషయాలు, బ్రిటీష్ కాలనీలలో భారతీయ ఒప్పంద కార్మికుల నియామకంపై నిషేధం మరియు రైల్వేల జాతీయీకరణ వంటి అంశాలపై చర్చలలో చురుకుగా పాల్గొన్నారు. దేశ విద్యా ప్రమాణాలను పెంచడంపై ఆసక్తి ఉన్న మాలవ్య 1916 లో బేనారుస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన వ్యవస్థాపకుడు. ఆ విశ్వవి్యాలయము భారతదేశంలో ఒక ప్రాథమిక విద్యాసంస్థ గా నిలిచింది.
సావిత్రిబాయి ఫూలే (1831 - 1897):

సావిత్రిబాయి ఫూలే గారు భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పరిగణించబడతారు. సావిత్రిబాయి ఫూలే గారు భారతీయ స్త్రీవాదానికి తల్లి వంటివారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి, భారతదేశంలో మహిళల హక్కులను మెరుగుపరచడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. సావిత్రి గారి వల్ల ఎంతో మంది ఆడపిల్లలకు ఇపుడు మంచి విద్య లభిస్తుంది. పరోక్షంగా తను అందరు ఆడపిల్లలకి గురువే. సావిత్రి గారు రచయిత మరియు కవి కూడా. ఆమె 1854 లో కావ్య ఫూలే మరియు బావన్ కాశీ సుబోధ్ రత్నాకర్‌లను ప్రచురించారు .
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 - 2015 ):

మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా" అని పిలవబడే ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారిని ఆధునిక గురువులలో అత్యున్నతమైన గురువుగా పేర్కొనవచ్చు. చిన్న పిల్లలు అంటే ఎంతో ప్రేమ కలిగిన అబ్దుల్ కలామ్ గారు ఎంతో మంది ఆధునిక విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన గురువు. ఇతని పుట్టినరోజు సందర్భంగా గా అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం జరుపుకుంటారు.2002 లో అధికార భారతీయ జనతా పార్టీ మరియు అప్పటి విపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుతో కలాం భారతదేశ 11 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు . "పీపుల్స్ ప్రెసిడెంట్" గా విస్తృతంగా ప్రస్తావించబడ్డాడు. అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు . కలామ్ గారు తన చివర్లో క్షణాలలో కూడా ఉపాధ్యాయుడిగానే కన్నుమూశారు.
Commentaires