- Surya Prakash, Content Writer, Akshara
భారత స్వాతంత్ర్య సమరయోధులలో ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక స్థానం ఉంది. వారిలో ముఖ్యంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత ఐక్యతా వారథిగా ప్రసిద్ధి చెందారు. గొప్ప దేశభక్తుడు అయిన పటేల్ దేశ సమగ్రత, సమైక్యత పట్ల తనకున్న ధృడమైన సంకల్పం, సమస్యలను పరిష్కరించే విధానం, దూరదృష్టి, చాతుర్యం దేశ నిర్మాణ తొలి నాళ్ళలో కీలక పాత్ర పోషించాయి. ఎంతో కఠినమైన, క్లిష్టమైన పరిస్థితులను ఎదురొడ్డి నిలిచి చాకచక్యంగా పరిష్కరించిన పటేల్ భారతదేశపు "ఉక్కు మనిషి"గా చరిత్రలో నిలిచారు.
పటేల్1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా ఒక రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనము నుండే చదువుపై ఆసక్తి కలిగిన పటేల్ యవ్వనంలో పైచదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్నారు, కాని తన ఆర్ధికస్థితి సహకరించకపోవడంతో ఆ కోరికని వదులుకొని అన్నయ్య విఠల్‌భాయ్ ఇంగ్లాండ్ వెళ్ళుటకు అతను తన కోసం పొదుపు చేసిన డబ్బు ద్వారా ఆర్థిక సహాయం అందజేశాడు. ఇలా తన కుటుంబంలో ఐక్యత, గౌరవాన్ని కాపాడారు. 36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక న్యాయశాస్త్ర కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి చేసిన వల్లభభాయ్ పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. స్వాతంత్ర్యం తరువాత, మన దేశం బ్రిటీష్ ఆధిపత్యం నుండి విడుదలైన 560 రాచరిక రాష్ట్రాలుగా విభజించబడింది. గొప్ప సవాళ్ల సమయంలో గొప్ప నాయకుడు గొప్ప పాత్రను ప్రదర్శిస్తాడు, అలాగే పటేల్ సాహిబ్ కూడా. అతను ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన ఏకీకరణలలో ఒకటైన దానిలో ముఖ్యపాత్ర పోషించారు. భారతదేశంలోని పెద్ద మరియు చిన్న రాచరిక రాష్ట్రాలన్నింటినీ ఏకం చేశారు. సర్దార్ పటేల్ యొక్క ప్రయత్నంలో అత్యంత ముఖ్యమైన భాగం భౌగోళికం, భాషలు, సంస్కృతులు మరియు సంప్రదాయాల పరంగా విభిన్నమైన దేశాన్ని మిళితం చేయగల అతని అవగాహన మరియు సామర్థ్యం.
1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ తుదిశ్వాస విడిచారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు తో సత్కరించింది 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన 'ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్' లో అతను మూడవ స్థానంలో ఎంపికైయ్యారు. 2014లో, మన ప్రధాని ఏకీకృత నాయకత్వంలో NDA అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశ ప్రభుత్వం వల్లభ్‌భాయ్ పటేల్ యొక్క స్మారక సహకారాన్ని మరియు దేశానికి చేసిన సేవలను గుర్తించడానికి ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఎన్నో గొప్ప కార్యాలను అంతకుమించి ఎన్నో ఘనతలను సాధించిన పటేల్ ను గుర్తుచేసుకుంటూ అతని కీర్తి ప్రతిష్టలను ప్రపంచనుమూలల కు చేరవేస్తూ అతడికి భారత ప్రభుత్వం 590 అడుగుల విగ్రహం భారత ప్రభుత్వం స్థాపించింది. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతడు చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.
コメント