top of page

Nobel Laureate Sir C.V. Raman

Writer's picture: ManisharanManisharan

భారతదేశంలో భౌతికశాస్త్రంలో మొట్టమొదటి నోబుల్ ప్రైజ్ విజేత, విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్. రామన్ గారు చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ అనే దంపతులకు 1888 వ సంవత్సరంలో 2 వ సంతానంగా జన్మించారు. రామన్ 1904లో యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు.విజ్ఞాన పరిశోధన తృష్ణ వల్ల తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు.


కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది. 18 సంవత్సరాలప్పుడు డిఫ్ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ (కాంతి యొక్క విక్షేపం) పై మొదటి సైన్స్ పేపర్ ను, రెండవ పేపర్ సర్పేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్స్ (ద్రవాల ఉపరితల ఉద్రిక్తత) పై రాసారు.



సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది? ఆకాశం నీలి రంగులోనే ఉండటానికి కారణం ఏంటి? పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు? ఇలాంటి ప్రశ్నలకు తన పరిశోధనలతో శాస్త్రీయంగా నిరూపించిన మహోన్నతడు సి.వి రామన్. ఇందులో భాగంగా చేసిన రామన్ ఎఫెక్ట్స్‌కే 1930లో "నోబెల్ బహుమతి" లభించింది. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను శక్తివంతంగా చూపించి,ఆప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సి.వి రామన్.భారత ప్రభుత్వం కూడా ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించి 1954 లో "భారతరత్న" బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ "లెనిన్ బహుమతి"తో సత్కరించింది. రామన్ జీవితంలో మైలురాయి "రామన్ ఎఫెక్ట్" సిద్దాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌‌ను 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం మరియు 1928లో "సర్" బిరుదు దక్కింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. చివరి వరకు భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసారు.

దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సి.వి. రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించారు.

విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి 'అంటూ ఆయన చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.


సైన్సే నా మతం… జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞానకవి సర్ సి. వి రామన్.

Comments


bottom of page