జాతీయ క్రీడా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం క్రీడల గురించి దేశజనులకు అవగాహన కల్పించడం. అసలు ఆటలు ఆడటం ఎందుకు అంటే, క్రీడలు మన మానసిక స్థితిని మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి, మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతాయి. చిన్నపిల్లలలో మానసిక వికాసానికి ఆటలు ఎంతగానో తోడ్పడుతాయి.ఈ రోజుల్లో క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అనేక మంది దీన్ని వృత్తిగా జీవన ధ్యేయం గా మలుచుకుని విజయాన్ని పొందారు, ఒలింపిక్ పతకాలతో దేశానికి వన్నె తెచ్చారు. ప్రపంచ వేదిక పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.
నేషనల్ స్పోర్ట్స్ డే చరిత్ర:
భారత దేశ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజునే మనం ప్రతీ ఏడాది జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం....ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905 న అలహాబాద్‌లో శారదా సింగ్ మరియు సమేశ్వర్ సింగ్ దంపతులకు జన్మించారు. ధ్యాన్ సింగ్ చాలా చిన్న వయస్సులోనే హాకీ వైపు ఆకర్షితుడయ్యాడు. తన తండ్రిలాగే, అతను కూడా 16 సంవత్సరాల వయస్సులో సైన్యంలో చేరాడు మరియు అక్కడ తనకు ఇష్టమైన హాకీను ఆడుతూ గడిపే వారు. అతను ఆర్మీ క్రీడా పోటీలో హాకీ విభాగంలో పాల్గొనేవారు.1936 సంవత్సరంలో జరిగిన బెర్లిన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు కి నాయకత్వం వహించారు.
వీరి నాయకత్వంలో భారత హాకీ జట్టు మూడు సార్లు వరుసగా 1928(amsterdam) 1932 ( లాస్ ఏంజెల్స్ )1936(బెర్లిన్ )లో జరిగిన ఒలింపిక్స్ లో పసిడి పతకం సాధించింది.
నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు:
ప్రతీ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం నాడు రాష్ట్రపతి భవన్ లో వేడుకలు ఘనం గా జరుగుతాయి. ప్రెసిడెంట్ అఫ్ ఇండియా క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను అవార్డులతో సత్కరిస్తారు.2020లో కోవిడ్ నిబంధనలను అనుసరించి వర్చ్యువల్ గా అవార్డ్స్ ను ఇవ్వడం జరిగింది. నేషనల్ అవార్డ్స్ కింద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న(¹రాజీవ్ ఖేల్ రత్న), అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఫర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మౌలానా అబుల్ కలాం అజాద్ ట్రోఫీ మరియు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ను ఇస్తారు.
Comments